వాట్సాప్ త్వరలో "Reply privately" అనే కొత్త అప్డేట్ తిస్కోరాబోతుంది. వాట్సాప్ లో ప్రస్తుతం వున్నాఅప్డేట్ ప్రకారం గ్రూప్ లో పంపిన మెసేజ్ కు గ్రూప్లో అందరికి కనబడేలా రిప్లై ఇచేలా సదుపాయం వున్నసంగతి మనకు తెలిసిందే, ఐతే తాజాగా "Reply privately" అనే అప్డేట్ ద్వారా గ్రూప్ లో వచ్చిన మెసేజ్ కి గ్రూప్ లోని అందరికి కాకుండా మెసేజ్ పంపిన వ్యక్తికీ తాను గ్రూప్లో పంపిన మెసేజ్ కు రిప్లై చేయడానికి వీలుగా ఉంటుంది.
ఐతే ఈ అప్డేట్ ప్రస్తుతం బీటా వెర్షన్ వినియోగదారులకు అందుబాటులో వుంది. ఈ సదుపాయాన్ని వాడుకోవడానికి ముందుగా తమ వాట్సాప్ బీటా ను ( వెర్షన్ నెంబర్ 2.18.355 ) అప్డేట్ చేసుకోవాల్సివుంటుంది.
దీనిని ఎలా వాడాలి :
మీరు బీటా వెర్షన్ ను అప్డేట్ చేసుకున్న తరువాత , మీ వాట్సప్ లోని గ్రూప్ తెరిచి, అందులో ఏ మెసేజ్ కి రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజ్ పై కొంతసమయం నొక్కిపట్టాలి ( లాంగ్ ప్రెస్ ) , ఇపుడు మీకు కుడివైపు పైభాగం లో ముడుచుక్కలు పై నొక్కాలి. అందులో మీకు " రిప్లై ప్రైవేట్లి" అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై నొక్కితే మీకు ఆ మెసేజ్ పంపినవారికి ఆ మెసేజ్ గురించి మీరు ఏమి తెలియజేయాలి అనుకుంటున్నారో అది పంపవచ్చు.
ఐతే ఈ అప్డేట్ లో కొన్ని లోపాలు ఉన్నట్టు మేము గుర్తించాము, మీరు వాట్సాప్ గ్రూప్ చాట్ తొలిగించేటప్పుడు అందులోని ఫోటోలు కానీ వీడియోలు కానీ తొలిగించడం లేదు, మీరు అవి తొలిగించాలి అనుకుంటే మల్లి గేలరీ లో వెళ్లి తొలిగించాల్సి వస్తుంది.
కాబట్టి ఇలాంటి లోపాలను తొలిగించి త్వరలో వాట్సాప్ సాధారణ అప్డేట్ లో కూడా దీని తిస్కోరాబోతుంది.
గమనిక : మీరు మా ఆర్టికల్స్ ను మిస్వకూడదు అనుకుంటే మా వాట్సాప్ లో చేరి అందరికంటే ముందు మా ఉపాదాట్లు ని మీరు నేరుగా మీ వాట్సాప్ లో పొందవచ్చు. మాతో చేరాలి అనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.
మా ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను లేదా ఫిర్యాదులను తెలియచేయడానికి కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయగలరు. ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి