దీపావళి రోజు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బస్సు ఎక్కినాడు, బస్సు ఎక్కిన ట్రాఫిక్ పోలీస్ ను కండెక్టర్ తనకు టికెట్ ఎక్కడికి ఇవ్వమంటారు అని అడిగాడు. ఐతే కానిస్టేబుల్ దానికి నిరాకరించి కండెక్టర్తో గొడవకు దిగ్యడు, "నేను డ్యూటీలో వున్నానని నాకు టికెట్ లేకుండా ప్రయాణించే హక్కు వుందని" కానిస్టేబుల్ కాసురుకున్నాడు.
అయితే దీని కండెక్టర్ అంగీకరించలేదు, టికెట్ తీసుకోకుంటే బస్సు దిగవల్సిందిగా కోరాడు. ఈ ఘటన హైదరాబాద్ లో లక్డికాఫుల్ నుండి కోటి వైపు వెళ్తున్న బస్సు లో చోటుచేసుకొంది. కానిస్టేబుల్ మాటలకూ బస్సు లోని ప్రయాణికులు కూడా తిరస్కరించారు, టికెట్ తీసుకోకుంటే బస్సు దిగాల్సిందే అని చెప్యారు, దీనితో కానిస్టేబుల్ రవీంద్ర భారతి బస్సు స్టాప్ లో దిగిపోయాడు.
ఈ సంఘటను మొబైల్ లో రికార్డు చేసిన ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఐతే పోలీస్లు మాత్రం ఈ ఘటనపై మాకు ఎలాంటి పిర్యాదులు రాలేదని తెలిప్యారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి