రోజులు మారుతున్నా కొద్దీ టెక్నాలజీలో వచ్చే అప్డేట్లు ( Updates ) మనం చూస్తూనే వున్నాం , ఐతే వాటిని సరిగా ఉపయోగించడానికి మనదగ్గర పెద్ద స్క్రీన్ వున్నా మొబైల్ ఉండాలని ఆశా , కానీ వాటిని ఉపయోగించేట్టప్పుడు బాగానే అనిపిస్తుంది , వాటిని మనతోపాటు బయటికి వెళ్ళేట్టప్పుడు తీసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది .
అందుకోసమే ఇప్పుడు మార్కెట్లో చైనా మొబైల్ కంపెనీ ‘రాయొలే’ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేసింది. రాయొలే విడుదల చేసిన ‘ఫ్లెక్స్‌పై’ ప్రపంచంలోనే మొట్టమొదటి ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ‘ఫ్లెక్స్‌పై’ పేరులో ఉన్నట్టుగానే ఈ మొబైల్‌ను సగానికి మడిచి, జేబులో పెట్టుకోవచ్చు.
మడిచిన తర్వాత కూడా ఇది డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇందులో రెండు కెమెరాలు ఉన్నాయి. టెలిఫోటో లెన్స్‌తో 20 మెగా ఫిక్సెల్ కెమెరా ఒకటి, వైడ్ యాంగిల్ లెన్స్‌తో 16 మెగాపిక్సెల్ మరో కెమెరాను అమర్చింది రాయొలే కంపెనీ. రెండు కెమెరాలు వెనకే ఉన్నా, మొబైల్ మడతబెట్టినప్పుడు 20 మెగాపిక్సెల్ కెమెరాను సెల్ఫీ కెమెరాగా ఉపయోగించుకోవచ్చు.
అమెరికా మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. 128 జీబీ వేరియంట్ మొబైల్ ధర 1318 డాలర్లుగా నిర్ణయించారు. మన కరెన్సీలో దాదాపు 96 వేల రూపాయలకు పైనే. 256 జీబీ వేరియంట్ ధర లక్ష రూపాయలకు పైనే ఉంటుంది. డిసెంబర్ నెల నుంచి మొబైల్ ఫోన్లను డెలీవరీ చేస్తున్నట్టు రాయొలే కంపెనీ తెలిపింది... అదేవిదంగా భారత మార్కెట్‌లో కూడా విడుదల చేయాలనే ఆలోచనలో ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి