IIT BombayX ఉచిత ఆన్లైన్ కోర్సులు అందిస్తోంది - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

12, నవంబర్ 2018, సోమవారం

IIT BombayX ఉచిత ఆన్లైన్ కోర్సులు అందిస్తోంది


మీ చదువు పూర్తీచేసుకున్నారా .. జాబ్ కోసం ప్రత్యేక కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారా. అయితే ఇది మీకు తప్పకుండ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. ఐఐటీ బాంబేఎక్స్‌ ఉచిత ఆన్‌లైన్‌ వేదిక విద్యార్థులకూ, ప్రొఫెషనల్స్‌కూ వారి కెరియర్‌లోని వివిధ దశల్లో తోడ్పడేలా ఉచిత కోర్స్ అందిస్తోంది. దీంతో ప్రధానమైన 7 ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ కోర్సులను ఎంపికచేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. దీనిగ్గురించి పూర్తి వివరాలు మీకోసం.

ఐఐటీ బాంబేఎక్స్‌ వివరాలు:

దేశంలోని పురాతన సంస్థల్లో ఐఐటీ బాంబేఎక్స్‌ ఒకటి. పరిశోధన ప్రోగ్రామ్‌లు, నాణ్యమైన విద్య పరంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కూడా పొందింది. దేశంలోకెల్లా ఈ సంస్థలో ప్రవేశాన్ని పొందడం కష్టంగా భావిస్తుంటారు. జేఈఈలో ఎంతో మంచి ర్యాంకు సాధించినవారికే ఇక్కడ సీటు సాధ్యమవుతుంది. ఇక్కడ బోధన రెండు విధాలుగా- ఆన్‌లైన్‌ మరియు తరగతి శిక్షణ ఉంటుంది. తమను తాము సాంకేతికంగా తీర్చిదిద్దుకోవాలనుకునేవారికి ‘ఐఐటీ బాంబేఎక్స్‌’ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీనిలో పలు రకాల కోర్సులను అందుబాటులో ఉంచింది.

కోర్స్ వివరాలు :  

1 ఇంట్రడక్షన్‌ టూ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌: అల్గారిథమ్‌ రీతిలో కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లోని ప్రాథమిక భావనలను నేర్చుకుంటారు. ఇది విద్యార్థులను ప్రోగ్రామ్‌లను రాయడంలో, ప్రయోగాత్మక గణన సమస్యలను పరిష్కరించడంలో ప్రోత్సహిస్తుంది. ఇది 6 వారాల కోర్సు. నేర్చుకోవాలనుకునేవారు వారానికి 4 గంటలను కేటాయించాలి.

2 ప్రోగ్రామింగ్‌ బేసిక్స్‌: దీనికీ ఇంట్రడక్షన్‌ టూ కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌కూ దగ్గరి సంబంధం ఉంటుంది. విద్యార్థులు అల్గారిథమ్స్‌, బేసిక్‌ డేటా టైప్స్‌తోపాటు సీ, సీ++ ప్రోగ్రామింగ్‌ లాంగ్వేజెస్‌కు సంబంధించి చాలా అంశాలను నేర్చుకుంటారు. ఇది 9 వారాల కోర్సు. నేర్చుకోదల్చినవారు వారానికి 6-8 గంటలు కేటాయించాల్సి ఉంటుంది.

3 ఫౌండేషన్‌ ఆఫ్‌ డేటా స్ట్రక్చర్స్‌: ప్రభావవంతమైన అల్గారిథమ్స్‌ను రూపొందించడానికీ, నిర్వహణయోగ్యమైన సాఫ్ట్‌వేర్లను నేర్చుకోవడానికీ డేటా స్ట్రక్చర్స్‌ తప్పనిసరి. కోర్సులో భాగంగా నంబర్స్‌ వంటి ప్రాథమిక డేటా టైప్స్‌ను కూడా నేర్చుకుంటారు. ఆపై సమర్థమైన స్ట్రక్చర్లను రూపొందించడానికీ, నిర్వహించడానికీ అవసరమైన కాన్సెప్చువల్‌ ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పరచుకుంటారు. ఇది ఆరు వారాల కోర్సు. నేర్చుకోవాలనుకునేవారు వారానికి 6 నుంచి 8 గంటల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.

4 అల్గారిథమ్స్‌: భవిష్యత్తంతా దీనిదే. దీనిలో భాగంగా న్యూమరికల్‌, స్ట్రింగ్‌, జామెట్రిక్‌, గ్రాఫ్‌ అల్గారిథమ్స్‌, ఇతర వాటిని నేర్చుకుంటారు. విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి సరైన డేటా స్ట్రక్చర్లను ఉపయోగించి అల్గారిథమ్స్‌ను ఎలా ఉపయోగించొచ్చో నేర్చుకుంటారు. ఇది ఆరు వారాల కోర్సు. నేర్చుకోవాలనుకునేవారు వారానికి కనీసం 6 నుంచి 8 వారాల సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది.

5 టెక్నికల్‌ స్కిల్స్‌: సాంకేతిక పరిశ్రమలో ఉద్యోగం చేయాలనుకునేవారికి ఈ కోర్సు చాలా ఉపయోగపడుతుంది. పైథాన్‌ నుంచి బిగ్‌డేటా వరకు అన్నింటికి సంబంధించిన బేసిక్స్‌ను నేర్చుకుంటారు. ‘హౌ స్టాక్‌ ఎక్ఛేంజ్‌ వర్క్స్‌?’ అనే ఒక కేస్‌స్టడీపైనా పనిచేస్తారు. ఇది నాలుగు వారాల కోర్సు.

6 ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌: ఈ కోర్సు బేసిక్స్‌కే పరిమితం కాకుండా ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ మెథడాలజీపై కొంత లోతైన అవగాహనను కలిగిస్తుంది. ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ పరిచయం, క్లాసెస్‌ అండ్‌ మెథడ్స్‌, పాలీమార్ఫిజం, ఇన్‌హెరిటెన్స్‌, ఇతర అంశాలు దీనిలో భాగంగా ఉంటాయి. ఈ కోర్సు ద్వారా ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ పద్ధతిలో సమస్యను గుర్తించడాన్ని నేర్చుకుంటారు. ఇది నాలుగు వారాల కోర్సు. వారానికి ఆరు నుంచి ఎనిమిది గంటలు కేటాయించాల్సి ఉంటుంది.

7 ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ డేటాస్ట్రక్చర్స్‌: సీ++కు ప్రతిరూపం లాంటి ఆబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌ ప్రోగ్రామింగ్‌ను ఉపయోగించి అన్ని మేజర్‌ డేటా స్ట్రక్చర్లను ఎలా అమలు చేయొచ్చో నేర్చుకుంటారు. ‘ఫౌండేషన్స్‌ ఆఫ్‌ డేటాస్ట్రక్చర్స్‌’ కోర్సుతో దీనికి దగ్గరి సంబంధం ఉంటుంది. ఇది 6 వారాల కోర్సు. వారానికి 6 నుంచి 8 గంటలు కేటాయించాల్సి ఉంటుంది.
ఈ కోర్సుల సర్టిఫికెట్లు కోరుకుంటే నమోదు చేసుకున్నవారు సుమారు రూ.3561 చెల్లించాల్సి ఉంటుంది.

    వెబ్ డిజైన్ నేర్చుకోవడం కోసం ఉత్తమమైన వెబ్సైటు వివరాల కోసం ఇక్కడ నొక్కండి 


వీటిని ఒక సమయంలో ఒక్కదాన్నే చేయాలనే నిబంధనేమీ లేదు. విద్యార్థి తన అనుకూలతను బట్టి, ఒకే సమయంలోని ఎన్ని కోర్సులను చేయాలనేది ఎంచుకోవచ్చు. లెక్చర్లు, అసైన్‌మెంట్లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. అంటే విద్యార్థికి తనకు సమయం అందుబాటులో ఉన్నపుడు వీడియోలు చూడటం, చదవడం, ఇచ్చిన ఎసైన్‌మెంట్‌ పూర్తిచేయడం వంటివి చేసుకోవచ్చు. కోర్సులు లేదా ఏదైనా విషయానికి సంబంధించి సందేహాలు ఎదురైనపుడు వెబ్‌సైట్‌లోని ‘డిస్కషన్‌ ఫోరం’లో అడగొచ్చు. ఈ కోర్సులకు ‘రీ టేక్‌’ అవకాశం కూడా ఉంటుంది. తీసుకున్న ప్రతిసారీ సర్టిఫికేషన్‌ లభిస్తుంది. కోర్సు పూర్తయ్యాక కూడా మెటీరియల్‌ అందుబాటులో ఉంటుంది. విద్యార్థి డాష్‌బోర్డులో ఆర్కైవ్స్‌లో దీన్ని తిరిగి పొందొచ్చు.

సంస్థ వెబ్‌సైట్‌: www.iitbombayx.in/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad