మనం ఇదివరకు తెలుసుకున్నాం Two Step వెరిఫికేషన్ అంటే ఏమిటి వాటికీ సంబంధించిన అప్స్ గురించి. ఒకవేళ మీరు ఆ పోస్ట్ మిస్ అయినట్లయితే ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి.
వాట్సాప్ ను హ్యాకర్స్ భారీ నుండి మనం జాగ్రత్తగా ఉండడానికి ఈ సదుపాయం వాట్సాప్ మనకు అందిస్తుంది.
Two Step వెరిఫికేషన్ ఎలా ఆక్టివ్ చేయాలి :
మొదటి దశ: ముందుగా మన వాట్సాప్ తెరిచి అందులో కుడిపక్కన వున్నా మూడు చుక్కలు పై నొక్కాలి. తర్వాత సెట్టింగ్ పై నొక్కాలి.రెడ దశ : సెట్టింగ్ లో మీ ప్రొఫైల్ కింద అకౌంట్ అనే ఆప్షన్ పై నొక్కాలి.
మూడవ దశ : ఇందులో మీకు Two Step వెరిఫికేషన్ ఉంటుంది. దాని క్లిక్ చేసినాక మీకు ENABLE అనే బటన్ కనిపిస్తుంది, దానిని ఏంచుకోవాలి.
నాల్గవ దశ : ఏంచుకున్నతర్వాత మీకు 6 అంకెల పిన్ అడుగుతుంది, అది మీరు నమోదుచేయాలి ( దానిని గుర్తుంచుకోవాలి ) . మీరు ఏంచుకున్న పిన్ ను నిర్ధారించడం కోసం మల్లి తిరిగి నమోదుచేయడానికి అడుగుతుంది, నమోదు చేయండి .
ఐదవ దశ : మీరు ఎచుకున్న పిన్ మర్చిపోతే రీసెట్ చేస్కునేవిధంగా మీ ఈ-మెయిల్ అడుగుతుంది నమోదు చేయండి. మీరు నమోదు చేసిన ఇ-మెయిల్ నిర్ధారించడం కోసం తిరిగి నమోదు చేయాలి.
ఆరవ దశ : మీరు Two Step వెరిఫికేషన్ విజయవంతంగా ఎనేబుల్ చేస్కున్నటు వాట్సాప్ నిర్ధారిస్తుంది.
అంతే ఇక మీరు మీ వాట్సాప్ కు Two Step వెరిఫికేషన్ తో భద్రపర్చుకున్నారు.
Two Step వెరిఫికేషన్ యొక్క ప్రయోజనాలు :
- మీ వాట్సాప్ ను ఇన్స్టాల్ చేస్కున్నపుడల్లా ఇ పిన్ తప్పకుండ నమోదుచేయాలి , కాబ్బటి మీ వాట్సాప్ ను హ్యాకర్స్ ఇన్స్టాల్ చేసి వాడాలి అనుకున్నపుడు వారికీ పిన్ నెంబర్ తప్పనిసరి .
- మీ వాట్సాప్ ను చాల రోజుల తరవాత మల్లి వాడేముందు ఇ పిన్ నమోదుచేయాలి లేకుంటే వాట్సాప్ తెరువలేరు . దీనివల్ల కొత్తవాళ్లు మీకు తెలికున్నాడా మీ వాట్సాప్ వాడలేరు .
గుర్తుపెట్టుకోవాలిసిన అంశాలు :
దయచేసి గమనించండి వాట్సాప్ మీకు మీ ప్రమేయం లేకుండా ఎలాంటి ఇ-మెయిల్స్ పంపదు. కాబట్టి ఎప్పుడన్నా మీకు వాట్సాప్ Two Step Verification రద్దుచేయమని కానీ లేదా మీ అకౌంట్ లో ఎలాంటి మార్పులకైనా వాట్సాప్ పేరుతో మెయిల్స్ వస్తే అలంటి లింక్ పై నొక్కకండి. అవి మీ వాట్సాప్ అకౌంట్ ను హ్యాకర్స్ అదుపులో వెళ్లే అవకాశాలు ఉంటాయి.వాట్సాప్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ నొక్కండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి