రెండు దశల ధృవీకరణ ( Two-step verfication ) అనునది పాస్వర్డ్ కు మరో పోరా అని చెప్పుకోవచ్చు. అనగా దీని సహాయంతో పాస్వర్డ్ మాత్రమే కాకుండా మన ఖాతాను యాక్సెస్ చేయడానికి ఓటీపీ కూడా తప్పనిసరిగా నమోదుచేయాలి. కావున మన ఖాతాను ఇదివరకు ఎక్కడన్నా అనుసంధానం చేసినప్పుడు ఆ బ్రౌసర్ మన పాస్వర్డ్ ను భద్రపరుచుకున్నట్లైతే ఇతరులు మన ఖాతాను మనకు తెలీకుండా వాడవచ్చు, కాబట్టి ఇలాంటి తప్పుడు లాగిన్ నుండి మన ఖాతాను మనం భద్రపర్చుకోవడం చాలాముఖ్యం. కాబట్టి ఈరోజు మనం దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రెండు దశల ధృవీకరణ అనునది మన ఖాతాను హ్యాకర్ల బారి నుండి కాపాడుకోవడంలో అతిముఖ్యమైనది. కావున ఇది ప్రతిఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం.
రెండు దశల ధృవీకరణ వలన కలుగు ప్రయోజనాలు :
- ఇది మనం పొందుపర్చుకున్న పాస్వర్డ్ కంటే చాలా సురక్షితం, ఏందుకనగా అవసరానికి తగట్టు కొత్త ఓటీపీ ను ఇస్తుంది.
- కంప్యూటర్ నుండి సృష్టించబడిన ఓటీపీ కి కేవలం రెండు లేదా అంతకంటే తక్కువ నిమిషం తో కలిగి ఉంటుంది , కావున దానిని దుర్వినియోగం చేయడానికి అవకాశం లేదు.
- దీనివలన జిమెయిల్, వాట్సాప్ , ఫేస్బుక్ , మరియు అమెజాన్ వంటి అన్ని ఖాతాలను హ్యాకర్స్ నుండి జాగ్రత్తగా భద్రపర్చుకోవచ్చు.
- దీనికోసం ప్రతేకమైన పరికరం అవసరంలేదు ఎప్పుడు మనతో వుండే మొబైల్ నెంబర్ తో లేదా మొబైల్ అప్ తో ముడిపడి ఉండును.
దీని కోసం మైక్రోసాఫ్ట్ Microsoft Authenticator ను మరియు గూగుల్ Google Authenticator అప్లికేషన్ ను అభివృద్ధి చేసిరి. మనం వీటిని ఏవిధముగా వివిధ సర్వీస్ లో వాడాలి అనేది క్లుప్తముగా తరువాతి పోస్ట్ లో తెలుసుకుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి