ఆన్లైన్ వినియోగదారులకు దిమ్మ తిరిగే షాక్ - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

12, అక్టోబర్ 2018, శుక్రవారం

ఆన్లైన్ వినియోగదారులకు దిమ్మ తిరిగే షాక్


ఆన్లైన్ వినియోగదారులకు దిమ్మ తిరిగే షాక్


పంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోయే అవకాశాలున్నాయి. ప్రధాన సర్వర్‌ నిర్వహణ పనుల కారణంగా  రానున్న 48 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలకు అంతరాయం కలగనుంది. రొటీన్‌ మెయింటనెన్స్‌ లో భాగంగా ప్రధాన సర్వర్‌, దానికి సంబంధించిన కనెక్షన్లను నిలిపివేయనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలకు కొద్దిసేపు ఆటంకం కలిగే సూచనలు ఉన్నాయి.

ఏందుచేత 

ఇంటర్నెట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ అసైన్డ్‌ నేమ్స్‌ అండ్‌ నంబర్స్‌(ICANN) ప్రధాన సర్వర్‌ ను మెయింటెయిన్ చేస్తుంటుంది.  పెరిగిపోతున్న సైబర్‌ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రధాన సర్వర్‌ నిర్వహణ పనులు  తప్పనిసరి అని ICANN తెలిపింది. ఇందులో భాగంగా క్రిప్టోగ్రాఫిక్‌ కీని మారుస్తోంది. దీనివల్ల ఇంటర్నెట్‌ అడ్రస్‌ బుక్‌ లేదా డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ (DNS) సేఫ్ గా ఉంటుంది.

దీనివలన కలిగే ప్రయోజనం 


సురక్షితమైన, స్థిరమైన DNSను పొందడం కోసం కొద్దిసేపు ప్రపంచ నెట్‌వర్క్‌ ను షట్‌ డౌన్‌ చేయడం అవసరం. రానున్న 48 గంటల్లో వెబ్‌ పేజీలను యాక్సెస్‌ చేయయంలో, ట్రాన్సాక్షన్స్ జరపడంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని కమ్యూనికేషన్‌ రెగ్యులేటరీ అథారిటీ(CRA) ప్రకటించింది. అవుట్‌ డేటెడ్‌ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ యూజర్లకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.

తీస్కోవాలిసిన జాగ్రత్తలు 


ఇంటర్నెట్ ఆన్లైన్ బ్యాంకింగ్ సదుపాయాలు 48 గంటలవరకు ( అంచనా ) ప్రకారం వాడకుండా ఉండడం మంచిది . ఏందుకంటె ట్రాన్సక్షన్ సమయంలో ఏదైనా లోటు జరిగితే దాని సమాచారం ఉండక పోవచ్చనే సందేహం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad