బాలీవుడ్లో మొత్తం ఇదే చర్చ
#MeToo ఉద్యమం ఇండియాలోనూ ఉధృతం అవుతోంది. MeToo కంప్లైంట్స్ భాగస్వాములు అవుతున్న పలువురు నటీమనులు, ఇతర రంగాలకు చెందిన మహిళలు తమకు ఎదురైన లైంగిక వేధింపుల సంఘటనల గురించి బయట పెడుతున్నారు. ఈ క్రమంలో లైంగిక వేధింపులకు పాల్పడిన పలువురు ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చాయి. తాజాగా ప్రముఖ సినీ, నవలా రచయిత చేత భగత్ కూడా ఈ కోవకు చెందిన వాడే అని తేలిపోయింది. ఓ మహిళతో అతడు సభ్యంగా ప్రవర్తించిన తీరు సాక్ష్యాలతో సహా బట్టబయలయ్యాయి. అయితే వెంటనే వెంటనే తన తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పడం గమనార్హం.
ఈ స్క్రీన్ షాట్లు నిజమే. అందులో నేను చేసిన వ్యఖ్యలపై చింతిస్తున్నాను.ఈ సందర్భంగా ఆమెకు నేను క్షమాపణలు చెబుతున్నాను. మీరు నా క్షమాపణలు స్వీకరిస్తారని భావిస్తున్నాను. నేను ఇలాంటి పని చేసినందుకు నా భార్య అనూషను కూడా క్షమాపణ అడుగుతున్నట్లు చేతన్ భగత్ పేర్కొన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి