గీతం విద్యాసంస్థల అధినేత మూర్తి అంత్యక్రియలు పూర్తి |
గీతం విద్యాసంస్థల అధినేత, టీడీపీ ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రభుత్వ లాంఛనాలతో మూర్తి అంతిమ సంస్కారాలు జరిగాయి. గీతం యూనివర్సిటీ సమీపంలోని రుషికొండ స్మృతివనంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. అంతకు ముందు మూర్తి నివాసం నుంచి అశేష జనవాహిని మధ్య ప్రారంభమైన ఆయన అంతిమ యాత్ర.. సిరిపురం, మూడో పట్టణ పోలీస్ స్టేషన్, శాంతి ఆశ్రమం, రుషికొండ మీదుగా గీతం విద్యాసంస్థల వరకూ కొనసాగింది. ఈ అంతిమయాత్రలో గీతం విద్యార్థులు, మూర్తి అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.
మరణానికి గల కారణం :
5 రోజుల క్రితం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంవీవీఎస్ మూర్తి మరణించారు. ఆ ప్రమాదంలో వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్ చౌదరి మృతి చెందగా కడియాల వెంకటరత్నం తీవ్రంగా గాయపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న వ్యాన్ ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి