పసికందును చంపినా తల్లి .. ఇంటర్నెట్ లో చూసి మరి - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

27, అక్టోబర్ 2018, శనివారం

పసికందును చంపినా తల్లి .. ఇంటర్నెట్ లో చూసి మరి


అవును మీరు విన్నది నిజమేనండి.. పసివాడి ఏడుపు విని విసుగువచ్చి ఓ తల్లి తన బిడ్డ అనికూడా ఆలోచించకుండా అతికిరాతంగా చంపింది, దీనికి తోడు తాను " అనుమానం రాకుండా చంపడం ఎలా మరియు పోలీస్ల నుండి ఎలా తపించుకోవాలి " అనేవాటిపై ఆన్లైన్ యూట్యూబ్ వీడియో లో చూసి మరి చెంపింది.

వివరాలప్రకారం వాషింగ్టన్ కు చెందిన అరిజోనా(19) అనే యువతి నెల రోజుల క్రితం ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దురదృష్టావశాత్తు ఆ చిన్నారి పుట్టుకతోనే అనారోగ్యంతో జన్మించాడు.

అనారోగ్యం కారణంగా పసికందు నిత్యం ఏడుస్తూనే ఉన్నాడు. నెలరోజులపాటు విపరీతంగా ఏడుస్తున్నాడు. పిల్లాడ్ని సముదాయించాల్సింది పోయి ఆ చిన్నారి ఏడుపు వినలేక బాత్‌టబ్‌లో ముంచి చంపేసింది.

ఆ తర్వాత ఆ పసివాడి మృతదేహాన్ని ఎవరికీ అనుమానం రాకుండా ఓ బ్యాగ్ లో కుక్కి సమీపంలోని పార్క్‌లో వదిలేసి వచ్చింది.

తర్వాత ఏం తెలియనట్లు తన బిడ్డను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ పోలీసులకు ఫోన్‌ లో ఫిర్యాదు కూడా చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత తల్లి అరిజోనాపైనే ప్రశ్నల వర్షం కురిపించారు.

అరిజోనా నీళ్లతొట్టిలో పడి చనిపోయాడని బుకాయించింది. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చింది పోలీసులకు.

నెలరోజుల పసికందు నీటితొట్టిలోకి ఎలా జారిపోతాడని అనుమానించిన పోలీసులు ఆమె సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని పరిశీలించారు.

పసికందును చంపడానికి ముందు అరిజోనా ఇంటర్నెట్‌లో 'అనుమానం రాకుండా చంపడం ఎలా', 'తక్షణమే చనిపోయే మార్గాలు', 'ది మిస్సింగ్ పిల్లలు కేసులు', మరియు ' తల్లిదండ్రులు వారి పిల్లలు చంపడానికి గల కారణాలు' 'కేసు నుంచి తప్పించుకునే మార్గాలు ఏంటి' అనే అంశాలపై సెర్చ్ చేసింది. ఇంటర్నెట్ లో చూపించినట్లు ఆ బాలుడిని బాత్ టబ్ లో వేసి చంపేసింది.

నెలరోజులుగా కొడుకు ఏడుపు వినలేక తానే ఆ చిన్నారిని బాత్‌టబ్‌లో ముంచి చంపేసినట్లుగా అరిజోనా నేరం అంగీకరించింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad