దేశ భాషలందు తెలుగు లెస్స : వేగంగా విస్తరిస్తున్న భాషలలో తెలుగు ప్రథమ స్థానం - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

23, అక్టోబర్ 2018, మంగళవారం

దేశ భాషలందు తెలుగు లెస్స : వేగంగా విస్తరిస్తున్న భాషలలో తెలుగు ప్రథమ స్థానం

తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు , గుండె లోతుల్లోంచి వచ్చేదీ - మనసు విప్పి చెప్పగలిగిందీ ఒక్క మాతృభాషలోనే. అందుకేనేమో మన తెలుగు వారు దేశం వదిలిన మాతృ భాషను మరవలేము అని గర్వాంగా చెప్పుకుంటూ మన భాషను, సంప్రదాయాన్ని రోజు రోజుకు రెట్టింపు చేస్తున్నారు.

విద్యార్థులకు మాతృభాష వచ్చినా, రాకపోయినా ఇంగ్లీష్ మాత్రం కచ్చితంగా రావాలంటూ మన స్కూలు యాజమాన్యాలు ఆంక్షలు విధిస్తుంటాయి, కానీ అమెరికాలోని మన తెలుగువారు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు.తమ మాతృభాష తెలుగును పిల్లలకు నేర్పించాలని తహతహలాడుతున్నారట. తెలుగు నేర్పించే ట్యూషన్ సెంటర్లకు తమ పిల్లలను పంపుతున్నారు. అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ చేసిన తాజా సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం వీడియో రూపంలో విడుదల చేసింది.



అమెరికాలో ఇంగ్లీష్ మినహా మాట్లాడే ఇతర భాషలపై అధ్యయనం చేయగా వేగంగా విస్తరిస్తున్న భాషలలో తెలుగు అగ్రస్థానంలో నిలిచింది. 2010 నుంచి 2017 మధ్య కాలంలో సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ చేసిన సర్వే ప్రకారం.. అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య 86 శాతం పెరిగింది. గతేడాది తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో 4 లక్షలకు పైమాటే అని తేలింది. 2010తో పోల్చితే ఇది దాదాపు రెట్టింపు ఉండటం గమనార్హం.



అమెరికాలో అత్యంత ఎక్కువగా మాట్లాడే విదేశీ భాషలలో స్పానిష్ అగ్రస్థానంలో నిలిచింది. అమెరికాలో దక్షిణాసియా భాషల్లో ఎక్కువగా మాట్లాడే భాషలు వరుసగా హిందీ, ఉర్దూ, గుజరాతీ, తెలుగు ఉన్నాయి. అయితే 2010-2017 మధ్య కాలంలో చేసిన అధ్యయనంలో మాత్రం వేగంగా విస్తరిస్తున్న భాషలలో తెలుగు ప్రథమ స్థానంలో నిలవడం విశేషం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad