#MeToo భారత దేశ్యం లో వైరల్ గా మరీనా సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు రాజకీయాల వైపు దీని బాట పట్టింది. లైంగిక వేధింపులకు సంబంధించి భారత్‌లో కొన్ని రోజులుగా సినీ ప్రముఖులు, హాస్యనటులు, నటులు, పాత్రికేయులు, రచయితలపై పలువురు మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిని భారత #MeToo ఉద్యమంగా పిలుస్తున్నారు.
ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతస్థాయి వ్యక్తుల్లో అక్బర్ ఒకరు. ఆయన గతంలో ద టెలిగ్రాఫ్, ది ఏషియన్ ఏజ్, ఇతర పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు. మొదటిసారిగా సోమవారం సీనియర్ పాత్రికేయురాలు ప్రియా రమానీ ఆయనపై ఆరోపణలు చేశారు. విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పాత్రికేయ వృత్తిలో ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు, యుక్త వయసులోని మహిళలను 'సమావేశాల' కోసం హోటల్ గదులకు రమ్మన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అక్బర్ మీద వచ్చిన ఆరోపణలపై ఆయనగాని, విదేశీ వ్యవహారాలశాఖగాని ఇప్పటివరకు స్పందించలేదు.
రాజకీయ నాయకులు సహా ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్న అందరిపైనా విచారణ జరపాలని కేంద్ర మంత్రి మనేకా గాంధీ కోరారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి